హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుకనూర్ సహకార సంఘానికి జాతీయ పురస్కారం

HNK: భీమదేవరపల్లి మండలం ములుకనూర్ సహకార గ్రామీణ పరపతి సంఘానికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. రైతులకు 70 ఏళ్లుగా అందిస్తున్న సేవలను గుర్తించి ఢిల్లీలో ఈ నెల 19న నిర్వహించిన ఇండియన్ కోఆపరేటివ్ సమిట్‌లో ఈ అవార్డును ప్రదానం చేశారు. సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పురస్కారాన్ని అందుకున్నట్లు ఏజీఎం సతీష్‌రెడ్డి తెలిపారు.