రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్నినో ప్రభావంతో ఈ యాసంగి సాగు విస్తీర్ణం 1,26,737 ఎకరాలకు తగ్గనుందని అంచనా. గతేడాది 2,10,576 ఎకరాల్లో సాగు జరిగింది. వరి సాగు 1.80 లక్షల ఎకరాల నుంచి 71,810 ఎకరాలకు పరిమితం కానుంది. భూగర్భ జలమట్టం 5.13 నుంచి 7.82 మీటర్లకు పడిపోయింది. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ
సిరిసిల్లలో యాసంగి సాగు తగ్గుదల


