హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక

JN: సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్‌-14 వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన జనగాం జిల్లా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి డి. గౌతమ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 23 నుంచి 27 వరకు మహారాష్ట్రలోని శిర్డీలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. శనివారం హెచ్‌ఎం లచ్చిరామ్ తెలిపారు.