హైదరాబాద్: 28°C
తెలంగాణ

విశ్వనాథం ఆరోగ్యంపై ఆరా తీసిన మంత్రి తుమ్మల

KMM: సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో ములగలపాటి విశ్వనాథంను శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, మంత్రి అభిమానులు పాల్గొన్నారు.