WGL : వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో జాగృతి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో శనివారం రాత్రి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, మూఢనమ్మకాలు, మంత్రతంత్రాల పేరుతో జరిగే మోసాలపై పాటలు, నృత్యాలు, నాటికల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై ప్రవీణ్, సర్పంచ్ మన్నూరు శారద సోము, కళాబృందం సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
నేరాలపై ప్రజలకు పోలీసుల అవగాహన


