హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.600 కోట్ల ఫండింగ్ ఆశ.. రూ.90 లక్షలకు టోకరా!

HYD: కొండాపూర్‌లో హై రైజ్ భవన నిర్మాణానికి రూ.600 కోట్ల నిధులు సమకూరుస్తామంటూ ఆరుగురు వ్యక్తులు ఓ నిర్మాణ సంస్థను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫండింగ్ పేరుతో రూ.కోటి వసూలు చేసి, కేవలం రూ.10 లక్షలే తిరిగి చెల్లించారు. మిగతా రూ.90 లక్షలు ఇవ్వకుండా మోసం చేయడంతో బాధిత సంస్థ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.