హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ అగ్నిప్రమాదం.. మహిళ మృతి

MDCL: ఐడీఏ ఉప్పల్‌లో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వ్యర్థాలను పారవేసేందుకు వెళ్లిన పింకీ దేవి (35) ఫ్యాక్టరీలోని డ్రమ్ పేలి మంటలు చెలరేగటంతో మహిళ మృతి చెందింది. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రామంతాపూర్ గాంధీనగర్‌లో నివాసముంటున్న ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.