హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్ఎండీ జలాశయంలో మునిగి ఇంటర్ విద్యార్థి మృతి

KNR: తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ జలాశయంలో నీట మునిగి వావిలాలపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి సుందరగిరి ఆర్యన్ సంజీవ్ మృతిచెందాడు. స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు జలాశయంలోకి దిగిన సంజీవ్‌కు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో గాలించగా మృతదేహం లభించింది.