హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

NLG: గ్రామీణ ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించేందుకు మైక్రోఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్‌వర్క్ (ఎంఎఫ్‌ఐఎన్‌) ఆధ్వర్యంలో, శనివారం నల్గొండలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైక్రోఫైనాన్స్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో బాధ్యతాయుతమైన రుణ వినియోగం, ఖాతాదారుల హక్కులు, ఆర్థిక భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.