హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జిల్లాలో హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా'

NLG: పట్టభద్రులు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాల సమస్యలను శాసనమండలిలో ప్రశ్నిస్తానని తెలంగాణ రక్షణ సేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ అన్నారు. శనివారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే తెలంగాణ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో రెండు దశాబ్దాలుగా పనిచేశానని పేర్కొన్నారు.