హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

MDK: ​మనోహరాబాద్ కొండాపూర్ రహదారిలో 11 కేవీ విద్యుత్ లైన్ల మార్పిడి పనుల కారణంగా ఇవాళ సేఫ్ కూల్ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు కాళ్లకల్ ఏఈ రాజ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మరమ్మతు పనుల కారణంగా సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.