హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెళ్లిళ్ల సందడి.. పూల వ్యాపారానికి పెరిగిన గిరాకీ!

హైదరాబాద్‌లో వరుస వివాహాలతో పూల మార్కెట్లు కళకళలాడుతున్నాయి. గుడిమల్కాపూర్, మల్కాజ్‌గిరి, ఉప్పల్ పెద్ద మార్కెట్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో పెళ్లి అలంకరణ పూలకు డిమాండ్ పెరిగింది. గతంతో పోలిస్తే 20 శాతం గిరాకీ పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. డిసెంబర్ రెండో వారం వరకు ఇదే జోరు కొనసాగనుందని అంచనా వేస్తున్నారు.