హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకున్నకమిషనర్

MBNR: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) ఐ.రాణి కుముదిని శనివారం పతి సమేతంగా అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు అర్చకులు, అధికారులు మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనం కల్పించి, వేద పండితులతో ఆశీర్వచనం ఇప్పించారు.