VKB: యాలాల మండలం విశ్వనాథపూర్ సమీపంలో కాగ్నా నదిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నది నుంచి ఇసుకను తవ్వి ఫిల్టర్ చేసి మరీ తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పట్టపగలే ఇసుక తరలింపు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ ఇసుక తవ్వకాలను కాపాడాలని కోరుతున్నారు.
తెలంగాణ
కాగ్నా నదిలో ఇసుక అక్రమ తరలింపు


