హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంకర రోడ్డుతో కాలినడకన ప్రయాణం

ASF: కెరమెరి మండలంలోని పరస్వాడకు రోడ్డు కష్టాలు దూరం కావడం లేదు. మండల కేంద్రం నుంచి కేలి(బీ) వరకు తారు రోడ్డు ఉంటుంది. అక్కడి నుంచి 4 కి. మీ. దూరం రాళ్లూరప్పలతో కూడి అధ్వానంగా ఉంటుంది. రేషన్ కోసం, నిత్యావసరాల కోసం గ్రామస్థులు నిత్యం కాలినడకనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు.