హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కల్తీ కల్లుపై ఎక్సైజ్ అధికారుల తనిఖీలు

కామారెడ్డి: జిల్లాలో శనివారం కల్తీ కల్లు విక్రయాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రెండో కల్లు డిపోతోపాటు దేవునిపల్లిలోని కల్లు దుకాణాల్లో ఎక్సైజ్ సీఐ పోశెట్టి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కల్లు నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. నమూనాల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.