NGKL: నల్లమల అడవుల్లో జంగిల్ సఫారీలో పర్యాటకులకు ఎలుగుబంటి దర్శనమిచ్చింది. పచ్చని అటవీ ప్రాంతంలో సంచరిస్తూ కెమెరా వైపు చూస్తున్న ఎలుగుబంటి అందమైన ముఖచిత్రం నేచర్ గైడ్ ప్రభాస్ ఫోటోగ్రఫీకి చిక్కింది. నల్లని దట్టమైన బొచ్చు, తెల్లని ముఖం, అమాయకమైన చూపులతో ఆకట్టుకున్న ఈ దృశ్యం ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తోంది.
తెలంగాణ
కెమెరాకు చిక్కిన ఎలుగుబంటి


