హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూలమలుపులో సూచిక బోర్డు లేక ప్రమాదం

ADB: భీంపూర్ మండలంలోని నిపాని–లక్ష్మిపూర్ మార్గంలో ఉన్న మూలమలుపు ప్రమాదకరంగా మారింది. అంతర్రాష్ట్ర రహదారి కావడంతో నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. వేగంగా వెళ్లే ద్విచక్రవాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారికి ఇరువైపులా చెట్ల కొమ్మలు తొలగించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.