ఏసీసీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో రేపు భారత్-A, పాకిస్తాన్-A జట్లు తలపడనున్నాయి. దోహా వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నేపాల్‌పై 306 పరుగుల రికార్డు విజయంతో తిలక్ వర్మ సేన జోష్ మీదుంది. యూఏఈపై గెలిచిన అబ్దుల్ సమద్ నాయకత్వంలోని పాక్ జట్టు కూడా గట్టి పోటీకి సిద్ధమైంది.
క్రీడలు
రేపు భారత్-పాక్ హైవోల్టేజ్ పోరు


