హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్‌లో అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన

ఉమ్మడి కరీంనగర్ జిల్లా అగ్రిగోల్డ్ బాధితుల అసలు బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరగనుంది. కరీంనగర్ అల్కాపురి కాలనీలోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాండ్ల కలర్ జిరాక్స్, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ నకళ్లతో హాజరుకావాలని సీఐడీ అధికారులు సూచించారు.