HYD: పోలీసులు, ప్రభుత్వ అధికారుల పేరుతో వీడియో కాల్స్ చేసి బెదిరించే ‘డిజిటల్ అరెస్ట్’ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. ‘X’ వేదికగా స్పందిస్తూ.. భయపెట్టి డబ్బులు లేదా బ్యాంకు వివరాలు అడిగితే ఇవ్వవద్దని, వెంటనే కాల్ కట్ చేయాలని తెలిపారు. మోసానికి గురైతే 1930కు కాల్ చేయాలని సూచించారు.
తెలంగాణ
డిజిటల్ అరెస్ట్ మోసాలపై అలర్ట్!


