హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాద్‌నగర్‌లో రేపు పల్స్ పోలియో

RR: షాద్‌నగర్ పట్టణంలోని ఈశ్వర్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద రేపు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో నిర్మూలనకు సహకరించాలని తల్లిదండ్రులను కోరారు.