MDK: శివంపేట మండల కేంద్రంలో రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. శివంపేట మండల కేంద్రంలో విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మత్తుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వివరించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత


