హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైస్కూల్లో 'ఏక్ బారత్ శ్రేష్టభారత్' కార్యక్రమం

NLG: చిట్యాల, జి.ప.ఉ.పాఠశాలలో శనివారం 'నో బ్యాగ్ డే' సందర్భంగా విద్యార్థుల్లో జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించేందుకు 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రాష్ట్రాల సాంప్రదాయ వేషధారణలతో ఆకట్టుకున్నారు. మధ్యాహ్నం నిర్వహించిన మాక్ పార్లమెంట్‌లో విద్యార్థులు అధికార, ప్రతిపక్ష నాయకులుగా వ్యవహరించారు.