SRPT: చివ్వెంల మండల పరిధిలోని లక్ష్మీనాయక్ తండాలో శనివారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 2 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత నాటు సారా తయారీ, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. నాటు సారా తయారీ, విక్రయాలు, నిల్వలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
లక్ష్మీనాయక్ తండాలో నాటు సారా పట్టివేత


