కోనసీమ: తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామివారిని ఆశీనులను చేసి గౌతమి నదిలో ఉత్సవం జరిపారు. ఈ వేడుకలో అర్చకులు, భక్తులు, ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా వెంకన్న స్వామివారి తెప్పోత్సవం


