హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీనివాసరావు

కృష్ణా: గుడివాడ 41వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి రామదేని వేణుబాబుతో కలిసి మాజీ మున్సిపల్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వార్డులో ఇంటింటికి వెళ్లి, కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తమ రెండు ఓట్లను కూటమి బలపరిచిన అభ్యర్థులకు వేయాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.