హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్కు స్థలం కబ్జాపై బీజేపీ నాయకుల పరిశీలన

KRNL: ఆదోని ఆర్టీసీ కాలనీలో పార్కు స్థలం కబ్జాకు గురైందని ఎమ్మెల్యే పార్థసారధికి ఫిర్యాదు అందడంతో ఆయన ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు శనివారం స్థలాన్ని పరిశీలించారు. 1982 లేఅవుట్ ప్రకారం పార్కుకు కేటాయించిన 62 సెంట్లలో సుమారు 5 సెంట్ల స్థలం ఆక్రమణకు గురైందని తెలిపారు. అధికారులు స్పందించి ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి పార్కు స్థలాన్ని కాపాడాలన్నారు.