PLD: పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అధికార కూటమి భయపడుతోందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, గురజాల పరిశీలకులు పడాల శివారెడ్డి విమర్శించారు. నామినేషన్ల స్క్రూట్నీ పేరుతో వైసీపీ అభ్యర్థుల దరఖాస్తులను అక్రమంగా తిరస్కరించారని ఆరోపించారు. న్యాయం కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశామని, తమ నాయకుడు ప్రజల్లోకి వస్తే తట్టుకోలేరని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నామినేషన్ల తిరస్కరణ అక్రమం'


