హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెనుక సీటులో ఉన్నా తప్పనిసరి!

HYD: ప్రయాణ సమయంలో సీట్ బెల్ట్ ధరించడం ప్రాణాలను కాపాడుతుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. ‘X’ వేదికగా స్పందిస్తూ.. సీట్ బెల్ట్ కేవలం ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాదని, ప్రమాదాల సమయంలో రక్షణ కవచంలా పనిచేస్తుందని పేర్కొన్నారు. డ్రైవర్‌తో పాటు ముందు, వెనుక సీట్లలో కూర్చునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.