హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే

BPT: కారంచేడు మండలం కుంకులమూరు వద్ద శనివారం సాయంత్రం జాతీయ రహదారిపై ఇన్నోవా కారు డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. చీరాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం వారిని గుంటూరు తరలించి, ఎమ్మెల్యే గల్లా మాధవితో మాట్లాడారు.