కోనసీమ: అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుంచి వెంకటరమణ థియేటర్ వెళ్లే దారిలో డ్రైను కన్నం పడి పది రోజులైంది. ప్రమాదకరంగా మారిన ఈ కన్నం వద్ద రక్షణ కోసం 'నో పార్కింగ్' బోర్డును అడ్డుగా ఉంచారు. దారి గుండా రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి డ్రైను కన్నాన్ని మూసివేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పది రోజులుగా డ్రైను కన్నం.. ప్రజల అవస్థలు


