హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రపంచ చెస్ బాక్సింగ్‌లో యువతికి స్వర్ణం

KMR: తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో జరిగిన 8వ ప్రపంచ చెస్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పిట్లంకు చెందిన తక్కడపల్లి ప్రతిభ స్వర్ణ పతకం సాధించారు. ఈ పోటీల్లో భారత్‌కు తొలి స్వర్ణం అందించి తెలంగాణతో పాటు కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఆమె విజయంపై శనివారం పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.