NLR: కొడవలూరు మండలంలో మూడవ విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తొలిరోజు సర్పంచ్ స్థానానికి 14 నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా వార్డు మెంబర్ల స్థానానికి 30 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవో వెంకట సుబ్బారావు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. డిసెంబర్ రెండవ తేదీన వీటికి ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు.
ఆంధ్రప్రదేశ్
తొలిరోజు సర్పంచ్‌కు 14 నామినేషన్లు


