హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చొద్దు’

HNK: ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చే ప్రతిపాదనను తక్షణమే నిలిపివేయాలని బీసీ-ఏ హక్కుల సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. శనివారం HNKలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నిర్ణయంతో ఇప్పటికే వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రుల కమిటీని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.