హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆస్ట్రేలియాను గెలిపించిన ఇండియన్

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన భారత సంతతి బ్యాటింగ్ ఆల్‌రౌండర్ నిఖిల్ చౌదరి నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు. 188 పరుగుల ఛేదనలో 38 బంతుల్లోనే 66 రన్స్ చేయడంతో పాటు 2 వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. ఢిల్లీలో పుట్టిన నిఖిల్, పంజాబ్ తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడి ఈ ఏడాదే ఆస్ట్రేలియా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.