హైదరాబాద్: 28°C
క్రీడలు

డేవిడ్‌ వార్నర్, ఖవాజాకు షాక్

శాండ్‌పేపర్ వివాదం మళ్లీ రాజుకున్న నేపథ్యంలో ఆసీస్ మాజీ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజాలను ఫాక్స్ స్పోర్ట్స్ కామెంటరీ నుంచి తాత్కాలికంగా తప్పించింది. తాజా పరిణామాలపై స్పందించాల్సిన ఒత్తిడి వల్ల వారు విధులపై దృష్టి పెట్టడం కష్టమని ఎండీ స్టీవ్ క్రావ్లీ తెలిపారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి ఇస్తున్నట్లు పేర్కొన్న ఆయన, తిరిగి విధుల్లో చేరే తేదీని ప్రకటించలేదు.