ADB: కార్పొరేట్ సెలూన్ల వల్ల నాయి బ్రాహ్మణుల జీవనోపాధి దెబ్బతింటోందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పట్టణ కార్యదర్శి లింగంపల్లి నర్సిములు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, నాయి బ్రాహ్మణులకు 100% సబ్సిడీ రుణాలు, ఉచితంగా ఆధునిక పనిముట్లు అందించాలని కోరారు.
తెలంగాణ
నాయి బ్రాహ్మణులకు 100% సబ్సిడీ రుణాలు


