హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

JGL: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కెడిసీసీ మేనేజర్ మకరందయ్య పేర్కొన్నారు. జన సురక్ష వారోత్సవాల్లో భాగంగా శనివారం సారంగాపూర్ మండలం పెంబట్లలో అవగాహన సదస్సు నిర్వహించారు. అర్హులంతా పీఎంఎస్‌బీవై, పీఎంజేజేబీవై బీమా, కేవైసీ, నామినీ సదుపాయం పొందాలని, మ్యూల్ ఖాతాలపై జాగ్రత్త వహించాలన్నారు. ఫైనాన్సియల్ లిటరసీ అధికారి విజయ్ కుమార్, సర్పంచ్ రాధ ఉన్నారు.