హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ కెప్టెన్‌ విధ్వంసం

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో రికార్డు సృష్టించాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి, AUSపై వేగవంతమైన టీ20 అర్ధశతకం చేసిన ENG బ్యాటర్‌గా నిలిచాడు. 2018లో జోస్ బట్లర్ (22 బంతుల్లో) నెలకొల్పిన రికార్డును బ్రూక్ తుడిచిపెట్టాడు. ఎంసీజీలో నమోదైన రెండో వేగవంతమైన టీ20 ఫిఫ్టీ కూడా ఇదే.