పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం ముత్తనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచిగా కూటమి బలపరిచిన అభ్యర్థి గాడిపర్తి సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ పదవికి జరిగిన నామినేషన్ల ప్రక్రియలో గాడిపర్తి సురేష్ ఒక్కరే బరిలో నిలవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ముత్తనపల్లి సర్పంచ్‌గా గాడిపర్తి సురేష్ ఏకగ్రీవం


