హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనుమళ్ల సర్పంచ్‌గా ముల్లూరి వెంకటేశ్వర్లు

ప్రకాశం: సింగరాయకొండ మండలం కనుమళ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ముల్లూరి వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.