VSP: పీఎంపాలెంలోని దీక్ష జూనియర్ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు డిమాండ్ చేశారు. మద్దిలపాలెంలోని ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారికి శనివారం వినతిపత్రం అందజేశారు. లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేసి సుమారు 50 మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడం దారుణమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'దీక్ష కళాశాలపై విచారణ జరిపించాలి'


