హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉర్లగూడెంలో టీడీపీకి తొలి ఏకగ్రీవం

ELR: చింతలపూడి మండలం ఉర్లగూడెం పంచాయతీ సర్పంచ్‌గా నందిపా మహేశ్వరి, ఉప సర్పంచ్‌గా కొండుబోయిన యువరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థులుగా బరిలో నిలిచిన వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.