NTR: నందిగామ మండలం కంచల గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఎన్నికల బరిలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. రామిరెడ్డి వెంకటేశ్వరరావు వైసీపీ మద్దతుతో, ఆయన తమ్ముడు రామిరెడ్డి సుబ్బారావు టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. అన్నదమ్ముల మధ్య నేరుగా పోటీ నెలకొనడంతో గ్రామంలో ఎన్నికల ఉత్కంఠ పెరిగింది.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ ఎన్నికల్లో అన్నదమ్ముల సమరం


