NTR: ఏ. కొండూరు మండలంలోని చీమలపాడు, కంభంపాడు గ్రామాల్లో నవంబర్ 11న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. ఓటర్లలో భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం దీని ముఖ్య ఉద్దేశ్యని తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల భద్రతకు పోలీసుల కవాతు


