హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఛలో ఢిల్లీకి సీపీఎం సంఘీభావ ప్రదర్శన

VSP: కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని సీపీఎం మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి.కృష్ణారావు డిమాండ్ చేశారు. డిసెంబరు 1 నుంచి 3 వరకు సీఐటీయూ చేపట్టనున్న ఛలో ఢిల్లీకి మద్దతుగా శనివారం మద్దిలపాలెం బస్ కాంప్లెక్స్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. కనీస వేతనాలు అమలు, లేబర్ కోడ్ల రద్దు, ధరల నియంత్రణ చేపట్టాలని కోరారు.