హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జమ్మలపాలెంలో కిడ్నాప్ ఆరోపణలు

NLR: జలదంకి మండలం జమ్మలపాలెం టీడీపీ నాలుగో వార్డు అభ్యర్థి దేవరపల్లి శివ గణేశ్‌ను శనివారం తెల్లవారుజామున కారులో కిడ్నాప్ చేసినట్లు గ్రామస్థులు ఆరోపించారు. అన్నవరం బిట్టు, ఎంపీటీసీ పెనుమల రమేశ్‌పై ఈ ఆరోపణలు చేశారు. తన అనుచరులను వేధిస్తున్నారని సర్పంచ్ అభ్యర్థి షేక్ ఖాదరాభి పేర్కొన్నారు.