AP: గుజరాత్‌లోని వడోదరలో కడప జిల్లా విద్యార్థి మృతి చెందాడు. పారుల్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న లక్ష్మీరెడ్డి(22).. స్నేహితులతో కలిసి సమీపంలోని నదిలోకి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో స్నేహితుడిని కాపాడబోయి నదిలో మునిగి చనిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీరెడ్డి స్వస్థలం కడప జిల్లా బి.కోడూరు మండలం మరాటిపల్లెగా పోలీసులు గుర్తించారు.
క్రైమ్
గుజరాత్‌తో తెలుగు విద్యార్థి మృతి


