AP: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ కానుకను సమర్పించనున్నారు. సుమారు రూ.150 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి విరాళంగా అందించేందుకు ముందుకొచ్చారు. 9 సెట్లుగా రూపొందించిన 45 రకాల బంగారు ఆభరణాలను ఈ నెల 26న టీటీడీ అధికారులకు అందజేయనున్నారు. తిరుమల ఆలయ చరిత్రలోనే ఒక భక్తుడు స్వామివారికి ఇంత భారీ స్థాయిలో కానుక సమర్పించడం ఇదే తొలిసారి అని టీటీడీ పేర్కొంది.
భక్తి
చరిత్రలోనే శ్రీవారికి భారీ విరాళం


